నేను మనీశ్ సిసోడియాను మిస్ అవుతున్నాను: కేజ్రీవాల్

“I Miss Manish”: Arvind Kejriwal Cites Jailed Minister In Birthday Post

న్యూఢిల్లీః ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోడీ .. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని స్టాలిన్ ఆకాంక్షించగా.. భగవంతుడు కేజ్రీవాల్‌కు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రార్థించారు. అయితే పుట్టినరోజు నాడు త‌న స్నేహితుడు మనీశ్ సిసోడియాను తలుచుకొని అరవింద్‌ కేజ్రీవాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. తాను మనీష్‌ను మిస్ అవుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపాడు.

“ఈ రోజు నా పుట్టిన రోజు. చాలా మంది తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు! కానీ నా పుట్టిన రోజు నాడు నేను మనీష్ సిసోడియా ని మిస్ అవుతున్నాను. తప్పుడు కేసులో జైల్లో ఉన్నాడు. ఈ రోజు అందరూ ప్రతిజ్ఞ చేద్దాం భారతదేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తి మేరకు మేము ప్రతిదీ చేస్తాము. అది బలమైన భారత్‌కు పునాది వేస్తుంది. అది భారత్‌ను నంబర్ 1గా చేయాలనే మా కలను సాకారం చేయడంలో సహాయపడుతుంది. అది కూడా మనీష్‌ను సంతోషపరుస్తుంది అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ రాసుకోచ్చారు.

కాగా మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టయ్యిన విష‌యం తెలిసిందే. ఈ కేసు విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.