బిపిన్ రావత్ మృతి పట్ల చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

తమిళనాడు కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఈయనతో పాటు ఈయన భార్య తో సలహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై యావత్ దేశ ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేసారు.

‘‘సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై.. గొప్ప ప్రతిభాపాటవాలు గల మన సైనికాధికారి, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు మరో 11 మంది చనిపోయారనే షాకింగ్ విషయం తెలిసి నా హృదయం బద్దలైంది. ఇది మన దేశానికి తీరని లోటు. వారికి అశ్రునివాళులు’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.