కమ్యూనిస్టులను నేనెప్పుడూ అవమానపరచలేదు – రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టులను తానెప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని.. అవమానించినట్లు నిరూపిస్తే ధర్మభిక్షం విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తానంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరికి సపోర్ట్ చేసినా.. ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌కే అండగా నిలవాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పార్టీ అభ్యర్థి పాల్వయి స్రవంతితో కలిసి జనగాంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..మునుగోడు గడ్డపై 12 సార్లు ఎన్నికలు జరిగితే.. ఒక్కసారి కూడా బీజేపీకి డిపాజిట్ దక్కలేదని, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని, మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చినట్లేనన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో స్రవంతిని గెలిపించాలని ఆయన కోరారు. కమ్యూనిస్టులను తానెప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని.. అవమానించినట్లు నిరూపిస్తే ధర్మభిక్షం విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరికి సపోర్ట్ చేసినా.. ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌కే అండగా నిలవాలని కోరారు.