ఎవరూ ఆందోళన పడొద్దు నేను క్షేమంగానే ఉన్నా

హోం క్వారంటైన్ లో ఉన్న రోజా

mla roja
mla roja

అమరావతి: నగరి ఎమ్మెల్యె రోజా గన్‌ మెన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయ తెలిసిందే. అయితే తన గన్ మెన్ కు కరోనా అని తెలిసిన వెంటనే నగరిలోని తన నివాసంలో రోజా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. తాను, తన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. గత 20 రోజులుగా ఆయన డ్యూటీకి హాజరుకాలేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/