ఈ నెల 21 నుంచి మూడు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ బయటకు వచ్చింది. జులై 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో షర్మిల పర్యటిస్తారు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం పోశయ్య గూడెం పోడు రైతులతో మాట్లాడతారు. జులై 22వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజ్ ల పరిశీలనతో పాటు, వరద బాధితుతులను కలసి మాట్లాడనున్నారు. ఇక 23వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు నిండిపోయాయి. ఇక గోదావరి ఉదృతి గురించి ఎంత చెప్పిన తక్కువే. భద్రాచలం వద్ద ఏకంగా 70 అడుగులే మేర గోదావరి ప్రవహించడం తో పట్టణంలోని పలు కాలనీ లు , ముంపు గ్రామాలు నీట మునిగాయి. దాదాపు ఐదు రోజుల పాటు ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండిపోయారు. ప్రస్తుతం గోదావరి శాంతించడం తో వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది. రీసెంట్ గా సీఎం కేసీఆర్ గోదావరి పరీవాహక ప్రాంతాలలో పర్యటించారు.