కరోనాతో మానవాళి సుదీర్ఘ యుద్ధం చేయాలి!

మిన్నెసోటా వర్శిటీ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజ్‌ రిసెర్చ్‌ అండ్‌ పాలసీ శాస్త్రవేత్తల హెచ్చరిక

corona virus
corona virus

అమెరికా: కరోనా మహమ్మారి 18 నుంచి 24 నెలల పాటు నిలిచి వుంటుందని, వైరస్ తో మానవాళి సుదీర్ఘ యుద్ధం చేయాల్సి వుందని మిన్నెసొటా యూనివర్సిటీ అధీనంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజ్‌ రిసెర్చ్‌ అండ్‌ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాలో 5 నుంచి 15 శాతం జనాభా మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని, దాని ఆధారంగానే ఓ రిపోర్టును తయారు చేశామని, ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది వైరస్ ను తట్టుకొనే శక్తిని సంతరించుకునేంత వరకూ వైరస్ ను నియంత్రించలేమని వెల్లడించారు. కరోనా వైరస్ శరీరంలో ఉన్నా, ఎలాంటి లక్షణాలూ బయట కనపడకుండా ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని, లోలోపల ఇన్ఫెక్షన్‌ ముదిరిపోతున్నా, లక్షణాలు త్వరగా బయటపడకుంటే, వైరస్‌ వ్యాప్తిని అంత సులువుగా అడ్డుకోలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/