బీఆర్ఎస్ లో చేరాలంటే ఎలా..? అభిమాని ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత రిప్లై

How to join BRS? MLC Kavitha’s reply to a fan’s tweet

Community-verified icon


బీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ ఎలా అంటూ మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్​ద్వారా రిప్లై ఇచ్చింది. దేశ‌వ్యాప్తంగా జ‌రిగే ప‌బ్లిక్ మీటింగ్‌లు, ప్రోగ్రామ్‌ల్లో నేరుగా పాల్గొని సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆ అభిమానికి ఎమ్మెల్సీ క‌వితి చూసించారు. కాంటాక్ట్ డిటేల్స్‌ను నేరుగా పంపాల‌ని, బీఆర్ఎస్‌లో స్వాగ‌తించేందుకు సంతోషిస్తున్నామ‌ని ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు. రాబోయేది కిసాన్ స‌ర్కార్ అని, బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు.

తెలంగాణ మాదిరిగా దేశంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనం అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌లో నిర్వహించిన పబ్లిక్​మీటింగ్ మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని, అది కేసీఆర్‌తోనే సాధ్యమనే నమ్మకం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింద‌ని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.