జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపి సిఎం

Hon’ble CM of AP Unfurl the National Flag at Indira Gandhi Municipal Stadium, Vijayawada LIVE

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ వేడుకల్లో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, వైఎస్‌ఆర్‌సిపి ముఖ్యనేతలు హాజరయ్యారు. అంతకముందు భారతీయులకు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.’ ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!’ అంటూ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/