ఎయిమ్స్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన అమిత్‌ షా

ఈ ఉదయం ఇంటికి పంపించిన వైద్యులు

home-minister-amit-shah

న్యూఢిల్లీ: కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా అనారోగ్యం బారినపడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన నిపుణుల సూచనతో గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ చేరి, 12 రోజుల చికిత్స అనంతరం 14న ఇంటికి వెళ్లారు. ఆపై ఆయన తీవ్రమైన బాడీ పెయిన్స్, నీరసం బారిన పడి, 18న ఎయిమ్స్ లో చేరారు. ఆసుపత్రిలోని అత్యుత్తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూర్తి అరోగ్యంగా ఉన్నారని, అందువల్ల డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/