ప్రకృతి వసంతం: ఉగాది పర్వదినం

పండుగలు.. విశేషాలు

Ugadi Festival

సనాతన హిందూ ధర్మవ్యవస్థలో మనకున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకుని బంధాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతుంటాము.

ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమి ఎంతటి సహనము కలదో అంతే విలువలతో కూడిన ఆకాశము ఎంతటి నిర్మలమైనదో మనం చూస్తూనే ఉన్నాం.

ఆరు రుతువుల అనుబంధాల సుగంధమే ప్రకృతి. మన ప్రకృతి ఆకృతి ఎంతో విశామైనది. ఆహ్లాదరకరమైనది. మనో వికాసానికి మానసిక ఉల్లాసానికి బాసటగా నిలబడేది ప్రకృతి.

సృష్టిలో ఉన్న జీవరాసులు దాదాపుగా అన్నీ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని పలుకరిస్తూ అందరి బంధువ్ఞగా అనుబంధాల్ని పెంచుకుంటూ ముందుకు సాగిపోతున్నాయి.

ఒక్క మానవు డు మాత్రం పట్టనట్లుగా పట్టించుకుంటే అమ్మో.. అనుకుని దూరం జరిగి జీవిస్తున్నాడు. ఇదేం విచిత్రమో.. ఇదేం లోకమో. రుతువుల క్రతువులో తొలి రుతువు వసంత రుతువ్ఞ. ప్రకృతి ప్రేమికులకు అత్యంత చేరువుగా ఉండేది ఈ వసంత రుతువు.

శిశిర రుతువులో రాలిన ఆకుల స్థానంలో కొత్త చిగురులు తొడిగి చక్కని ఆకుపచ్చ చీరకు పూలు సొగసులతో సింగారించుకున్నట్లుగా ఉంటుంది ప్రకృతి ఈ వసంత రుతువులోనే.

మనిషి పాత వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించినట్లుగా కొత్త జీవితానికి ప్రతీకగా ఆలంబనగా కొత్త ఆశలతో కోరికలతో సహవాసం చేయమని తెలియచేస్తూ పలుకరిస్తూ వస్తుంది వసంత రుతువు .

ఈ మధుమాసపు విన్యాసము మనసుకు హాయిని ఆనందాన్ని తీయని అనుభూతుల్ని అందిస్తుంది. పులుపు, ఉప్పు, కారం, తీపి, వగరు, చేదుల సమ్మేళనం కలిగిన ఉగాది పచ్చడి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో మనకు తెలిసిందే.

ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమి ఎంతటి సహనము కలదో అంతే విలువలతో కూడిన ఆకాశము ఎంతటి నిర్మలమైనదో మనం చూస్తూనే ఉన్నాము.

కల్తీల మయంతో కలుషిత పరిసరాలతో నడుస్తున్న ప్రస్తుత ప్రజా సమాజంలో కల్మషము, కుట్రలు, కుతంత్రాలు, కార్పణ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏ మాలిన్యము లేనిది ఒకే ఒక్క ప్రకృతి.

వసంత రుతువు లోని వయ్యారాలను మనం పరిశీలిస్తే ఒకింత ఆశ్చర్యము ఒకింత పులకింత కలగక మానదు. వన్నె చిన్నెల వెన్నెల సొగసులను ఈ రుతువ్ఞలోనే తనివితీరా చూడాలి.

మత్తెక్కించే మల్లెల పరిమళాలు మనసారా! ఆస్వాదించాలంటే ఇదే అనువైన కాలము. ప్రకృతి కాంత మేని విరుపులు, మెరుపుల ఈ రుతువ్ఞలోనే తిలకించాలి సుమా!

ప్రకృతితో ఏకమై వసంతంతో విలాసంగా సహవాసం చేయాలంటే ఈ రుతువే అనుకూలమైనది. చైత్రవైశాఖల సరసన కోయిల స్వరాల సారం వినసొంపుగా ఉండేది.

ఈ వసంత రుతువ్ఞలోనే ఆరగించాలి ఆనందించాలి. ఆనాటి ప్రబంధ కవ్ఞల దగ్గర నుంచి నేటి ఆధునిక రచయితల వరకు ప్రకృతిని ఆరాధిస్తూనే ఉన్నారు.

సందర్భం వచ్చినప్పుడల్లా వారి రచనల్లో ప్రకృతిని ప్రస్తావిస్తూ రుతువ్ఞల వర్ణనలతోనే సమాజంలో గుబాళింపచేసారు. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది.

ఇక్కడ నిర్లిప్తతకు, నిరాశకు, వాయిదాలకు స్థానమే లేదు. మనసు ఉల్లాసంగా లేనప్పుడు, తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ప్రకృతి మనిషికి మాంచి టానిక్‌లా పనిచేస్తుంది.

– చివుకుల వాసుదేవమూర్తి

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : http://epaper.vaartha.com/