కరోనాతో హాలీవుడ్ స్టార్ అలాన్ గార్ఫీల్డ్ మృతి
పలువురు సంతాపం
ప్రముఖ హాలీవుడ్ నటుడు అలెన్ గార్ఫిల్డ్(80) కరోనా కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి రోని బ్లాక్లే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
అలెన్ 1968లో తెరంగేట్రం చేశారు. నాష్‌విల్లే, ది స్టంట్ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్ బాక్సర్‌గా, స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేశారు. చివరిసారి 2016లో విడుదలైన చీఫ్ జాబులో కనిపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/