ఈసారి బాలయ్య తో ఢీ కొట్టేది ఎవరో తెలుసా..?

గత కొంతకాలంగా విజయం లేని నందమూరి బాలకృష్ణ..రీసెంట్ గా అఖండ తో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు.

ఈ సినిమాలో కూడా హీరోకు తగ్గ స్థాయిలో విలన్ పాత్రను రాసుకున్నాడట గోపీచంద్. అందుకు బాలయ్య స్థాయి యాక్షన్ కనిపించే విలన్ కోసం ఇప్పుడు వేట మొదలు పెట్టారట. లెజెండ్ సినిమాలో జగపతి బాబును.. తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ గా కనిపించగా ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున గోపిచంద్ సినిమా కోసం విలన్ గా కనిపించనున్నాడట. అర్జున్ ఇప్పటికే చాలా సినిమాలలో ముఖ్య పాత్రలు చేసినా సాలిడ్ స్ట్రాంగ్ విలన్ పాత్ర పడలేదు. ఈసారి అది ఫుల్ ఫిల్ చేయనున్నాడట గోపిచంద్ మలినేని.

అర్జున్ కు తెలుగుతో పాటు తమిళం, కన్నడలో కూడా ఫాలోయింగ్ ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం కాగా ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తుంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి ఆధారంగా కథ రాసుకున్న గోపీచంద్ ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.