గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నియామ‌కంపై హైకోర్టు కీల‌క తీర్పు

ts-high-court

హైదరాబాద్‌ః గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.