ఫోన్ అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు

ఏపీ సీఐడీకి ఎంపీ రఘురామ లీగల్ నోటీసు

MP Raghu Rama krishna Raju
MP Raghu Rama krishna Raju

Amaravati: ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. పార్లమెంటులో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, తన ఫోన్ లో సంబంధిత సమాచారం కూడా ఉందని తెలిపారు. . పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు తన ఫోన్ తిరిగివ్వాలని కోరారు. . ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఎంపీ హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరార. అయితే , స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని ఆరోపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/