విజయవాడలో ఆకతాయికి బుద్ధి చెప్పిన యువతీ..కర్రతో చితకబాదింది

ఏపీలో రోజు రోజుకు ఆడవారిపై అత్యాచారాలు , వేదింపులు ఎక్కువై పోతున్నాయి. ఒంటరి మహిళా కనిపిస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మొన్న విజయవాడ , నిన్న గుంటూరు జిల్లాలో ఇలా ఎక్కడ పడితే అక్కడ కామ మృగాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడ లో మాత్రం ఓ యువతీ ఆకతాయికి బుద్ది చెప్పి అందరికి ఆదర్శమైంది.

గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఓ వ్యక్తి బైక్ ఆపాడు. అతడు యువతిని వేధించాడు.. వెంటనే ఆమె అప్రమత్తం అయ్యింది. రోడ్డు పక్కన ఉన్న ఓ కర్రను తీసుకుని అతడిపై తిరగబడింది.. ఆ ఆకతాయిని కర్రతో చితక్కొట్టింది. ఈ ఘటన తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పోకిరీని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి ఆకతాయిని బుద్ధి చెబుతున్న సీన్ మొత్తం రోడ్డుపై వెళుతున్నవారు మొబైల్‌లో రికార్డ్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. యువతి ధైర్యాన్ని అంత మెచ్చుకుంటున్నారు. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి ప్రశంసలు కురిపించారు.