చిత్రసీమలో మరోవిషాదం : ప్రముఖ హీరోయిన్ తండ్రి కన్నుమూత

చిత్రసీమలో వరుస మరణ వార్తలు సినీ ప్రముఖులను , అభిమానులను కలవరపెడుతున్నాయి. గత రెండు వారాలుగా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లల్లో విషాదాలు జరుగగా..ఆదివారం ప్రముఖ హీరోయిన్ తండ్రి కన్నుమూశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న నందితా శ్వేత.. తండ్రి క‌న్నుమూసారు. ఈ విష‌యాన్ని నందిత త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. నా తండ్రి శివ స్వామి 54 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపింది.

నందిత తండ్రి ఇక లేర‌ని తెలుసుకున్న ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం తెలియ‌జేస్తూ, కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. కన్నడ చిత్రం “నంద లవ్స్ నందిత” చిత్రంతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు క‌థానాయిక‌గా ప‌లు భాష‌ల‌లో న‌టిస్తూ, లేడి ఓరియెంటెడ్ సినిమాల‌లోను న‌టిస్తుంది. ఈ క్రమంలో ఆమె తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.