ఘోర రోడ్డు ప్రమాదం…27 మంది మృతి

ఇండోనేషియాలో లోయలో పడిన పర్యాటక బస్సు

జకార్తా : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జావాలో పర్యాటక బస్సు లోయలో పడిన ఘటనలో27 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తీర్థయాత్ర కోసం బస్సులో పశ్చిమ జావా దీవుల్లోని సుమేదంగ్ జిల్లాలోని పుణ్యక్షేత్రం సందర్శనకు వచ్చారు. బస్సు వేగంగా నడుపుతుండగా బ్రేకులు ఫెయిలై 65 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 27 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని క్రేన్ల సాయంతో కాపాడి అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పిల్లలున్నారని ఇండోనేషియా అధికారులు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/