ఈ నెల 28 న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫలితాల ప్రకటన వచ్చేసింది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు.

మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించడం గమనార్హం.