రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. జగన్ పర్యటన కు సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుతారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో మాట్లాడుతారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ నుంచి బయల్దేరి కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు.

ఒక్క కంప్యూటర్ బటన్ క్లిక్ తో అమ్మ ఒడి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది 12.45కి బయలుదేరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2.30గంటలకు చేరుకుంటారు. అనంతరం సీఎం నివాసానికి 2.40 గంటలకు చేరుకుంటారు.