నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ బరిలో మమతా
291 మందితో తొలి జాబితా విడుదల చేసిన మమతా బెనర్జీ
cm-mamata-banerjee-to-fight-from-nandigram
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 మందితో పార్టీ అభ్యర్థులను శుక్రవారం ఆమె ప్రకటించారు. ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి కూడా నందిగ్రామ్ నుంచి పోటీచేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మమతను ఓడిస్తానని ఆయన చాలెంజ్ చేశారు.
కాగా, తొలి జాబితాలో 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలకు టీఎంసీ టికెట్లు ఇచ్చింది. 80 ఏళ్లకు పైబడిన వారికి మమత టికెట్ నిరాకరించారు. ఉత్తర బెంగాల్ లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతలుగా పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 11న సీఎం మమతా బెనర్జీ నామినేషన్ వేయనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/