భద్రాద్రి పర్యటనలోను గవర్నర్ ను అవమానించిన కలెక్టర్, ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు , నేతలు తనను గౌరవించడంలేదని రీసెంట్ గా ఢిల్లీ వేదికగా తెలిపినప్పటికీ..ప్రభుత్వ అధికారుల్లో మార్పు రాలేదు. ఈరోజు నుండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై పర్యటిస్తుండగా..కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడం తో మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.

ఈరోజు నుండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రెండు రోజుల పర్యటన చేయబోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఆదివారం రైలు ద్వారా భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాకు చేరుకున్నారు. ముందుగా భ‌ద్రాద్రి రామాయ్య మ‌హా ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వంలో గ‌వ‌ర్న‌ర్ తమిళి సై పాల్గొన్నారు. భద్రాద్రిలో కూడా ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజరు అయ్యారు. ఉదయం ప్రత్యేక‌ రైలులో కొత్తగూడెం కు చేరుకున్న గవర్నర్ దంపతులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి(పా) డైరెక్టర్ బలరాం స్వాగతం పలికారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజరు కావడం ఫై గవర్నర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.