జపాన్ లో విరిగిపడ్డ కొండచరియలు : బురదలో వందలాది మంది గల్లంతు

సహాయక చర్యలు ముమ్మరం

Heavy rains in Japan
Heavy rains in Japan

Japan: భారీ వర్షాలు కారణంగా జపాన్‌లోని అటామి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 20 మంది గల్లంతయ్యారు. వర్షాల దాటికి 80 ఇళ్లు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. అంతేకాకుండా కార్లు కూడా కొట్టుకుపోయాయి. టోక్యోకు పశ్చిమంగా వంద కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీర పట్టణమైన అటామిలో శనివారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోయలు, పర్వత ప్రాంతాల్లోని మట్టి వదులుగా మారి కొండచరియలు విరిగిపోతున్నాయి. బురద వెల్లువలా విరుచుపడడంతో 20 మంది గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తోంది. గల్లంతైన వారి సంఖ్య వందకుపైనే ఉండొచ్చని అధికారుల అంచనాగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/