హైద‌రాబాద్‌లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన

రోడ్లన్నీ జలమయం

heavy-rain-in-hyderabad-city

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. పంజాగుట్ట ఏరియాలో భారీ వ‌ర్షం కురియ‌డంతో జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉద‌యం నుంచి ఎండ‌లు దంచికొట్టాయి. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఆకాశం మేఘావృతం అయింది. అనంత‌రం ఈదురుగాలుల‌తో కూడిన భార వ‌ర్షం కురిసింది. ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట‌, కాచిగూడ‌, సైదాబాద్, తార్నాక‌, సికిందాబాద్‌, గోల్నాక‌, న‌ల్ల‌కుంట‌, రాంన‌గ‌ర్, హ‌బ్సిగూడ‌, నారాయ‌ణ‌గూడ‌, లాలాపేట్, నాచారం, మ‌ల్లాపూర్, అబిడ్స్, గోషామ‌హ‌ల్, బ‌షీర్‌బాగ్, కోఠి, సుల్తాన్ బ‌జార్, బ‌న్సిలాల్‌పేట‌, రామ్‌గోపాల్‌పేట్, రాంన‌గ‌ర్, విద్యాన‌గ‌ర్, గాంధీన‌గ‌ర్‌, అడిక్‌మెట్‌, దోమ‌ల‌గూడ‌, క‌వాడిగూడ, బాగ్‌లింగంప‌ల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది.

కాగా నేడు, రేపు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. బయటికి వెళ్లేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.