భాగ్యనగరంలో కుండపోత ..

ఎండ వేడిమి నుంచి ఊరట కలిగించిన అకాల వర్షం

Heavy rain in Hyderabad
Heavy rain in Hyderabad

Hyderabad: మండే ఎండల నుంచి భాగ్య నగర వాసులు ఒకింత ఊరట పొందుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఇదిలావుండగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, మెహదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్, రాజేంద్రనగర్,అంబర్‌పేట్‌, నారాయణగూడ, నాంపల్లి, ఎల్బీ నగర్‌ వనస్థలిపురం, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రహదారులు జలమయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/