షాపు యజమానిపై టీఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి దాడి

సీసీ టీవీలో దృశ్యాలు: పోలీసులు కేసు నమోదు

షాపు యజమానిపై  టీఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి   దాడి
TRS leader Shanti Devi attacks shop owner

Hyderabad: షాపు మూసివేయకపోవడంతో యాజమానిపై టీఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి దాడికి పాల్పడ్డారు. బేగం బజార్ దళ్ మండిలో రాత్రి 8 గంటలకు షాపు క్లోజ్ చేయాలంటూ టీఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి హుకుం జారీ చేశారు. ఓ ప్లైవుడ్ షాప్ మూసివేయకపోవడంతో సదరు షాప్ యాజమానిపై శాంతి దాడి చేశారు. దీంతో ‘నువ్వు అధికారివా ? నీకేం సంబంధం?’ అంటూ శాంతి దేవిపై దుకాణం యజమానులు తిరగబడ్డారు. తనను ప్రశ్నించినందుకు షాప్ యజమానులపై దాడికి పాల్పడ్డారు.

. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. షాప్ యజమాని ఈ ఘటనపై బేగం బజార్ పోలీసులకు పిర్యాదు చేశారు. శాంతి దేవి పై 323, 290 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉలంఘించినందుకు మరో కేసు నమోదు చేయనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/