నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ

Chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనుందని హైకోర్టు వర్గాలు తెలిపాయి. టిడిపి పాలనలో అమలు చేసిన ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ అధికారులు చంద్రబాబుపై కేసు పెట్టారు. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగాయని, క్విడ్ కో ప్రో కు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు.

సీఐడీ పెట్టిన ఈ రెండు కేసులలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నేడు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనున్నట్లు సమాచారం.