కవిత బెయిల్ పిటిషన్లపై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ

MLC Kavitha

హైదరాబాద్‌ః ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్‌ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.

ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. కవిత 9న ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ కేసులో ఈ నెల 10న, సీబీఐ కేసులో ఈ నెల 16న స్వర్ణకాంత శర్మ బెంచ్ విచారించింది. తదుపరి విచారణను కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 16న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.