నేడు ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం స్వీకారం

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణం చేయనున్నారు.

కాగా, భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఈటల రాజీనామాతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత అక్టోబర్ 30న హుజురాబాద్ లో ఉపఎన్నిక నిర్వహించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/