కొండగట్టు ఆంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

కొండగట్టు ఆంజనేయ స్వామిని బుధువారం తెలంగాణ మంత్రులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. హరీశ్ రావు సతీ సమేతంగా దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి హరీశ్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆంజనేయ స్వామి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, విద్యాసాగర్రావు, సంజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.