యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆర్జిత పూజల్లో భాగంగా సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

రాబోయే ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.