విజయశాంతి చెల్లని రూపాయి అంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో తెరాస , బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి కి చేరుతుంది. కేవలం ఈటెల పైనే కాదు ఈటెల కు సపోర్ట్ చేస్తున్న నేతల ఫై కూడా తెరాస నేతలు విమర్శిస్తున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో తెరాస ను గెలిపించాలని కంకణం కట్టుకున్న హరీష్ రావు..తాజాగా బిజెపి నేత విజయశాంతి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయశాంతి చెల్లని రూపాయి..నా పుణ్యంతో ఎంపీ అయిందంటూ వ్యాఖ్యలు చేసారు.

హుజురాబాద్ ప్రచారంలో భాగంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ లో వడ్లు కొనకుంటే రోడ్ల పై పోసి తగల పెడుతున్నారు.. అక్కడ ఏ ప్రభుత్వం ఉందని నిలదీశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వడ్ల కొనడం లేదని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా.. లేదా ఆలోచించాలని ప్రజలను కోరారు. మంత్రిగా ఉండి ఈటల హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ కట్టాడు కానీ.. పేద విద్యార్థుల కోసం ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయాడని ఫైర్‌ అయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పని చేసి.. హుజురాబాద్‌ నియోజక వర్గానికి కనీసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాడా ? అని నిప్పులు చెరిగారు. మెదక్ లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతదా ? తన పుణ్యంతో విజయశాంతి ఎంపీగా గెలిచిందని చురకలు అంటించారు.