పల్లెప్రగతిలో సంగారెడ్డి ప్రథమస్థానంలో ఉంది

తాగునీరు, 24 గంటల విద్యుత్‌,మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది..హరీష్‌ రావు

harish rao
harish rao

సంగారెడ్డి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు పఠాన్ చేరు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని , ఈ సందర్భంగా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం రాష్టం లోనే ప్రథమం అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, 24 గంటల విద్యుత్‌,మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 100 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భయపడకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా బారినపడిన వారిని చులకనగా చూడొద్దని మంత్రి హరీష్‌రావు తెలిపారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/