రాజశేఖర్‌ రెడ్డికి నివాళ్లు అర్పించిన రేవంత్ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైస్సార్ కు ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమని…. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు వైస్సార్ అని కొనియాడారు. ముస్లిం లకు రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని తెలిపారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. రాజశేఖర్‌ రెడ్డికి హైదరబాద్‌ లో స్మృతి వణం లేకపోవడం అవమానమని రేవంత్ అన్నారు. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్నారు మంచిదేనని.. వైస్సార్ స్మృతి వనం నిర్మించాలని కేసీఆర్‌ సర్కార్‌ కు డిమాండ్ చేసారు. వైస్సార్ స్ఫూర్తి తో పని చేసి తెలంగాణ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామని ఈ సందర్బంగా రేవంత్ అన్నారు. ఇక నిన్నటి తో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకోవడంతో గాంధీ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ లోకి పలువుర్ని ఆహ్వానించారు.

అలాగే రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సీఎం జగన్ తో పాటు విజయమ్మ , షర్మిల తదితరులు ఉదయాన్నే ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళ్లు అర్పించి , ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.