దేశంలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కొవిడ్-19) కేసులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ తెలిపారు. కాగా, ఇటీవల విదేశాల నుంచి కేరళలోని పథనంతిట్టాకు వచ్చిన ఓ కుటుంబంలోని ఐదుగురికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులో వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు మేరకు బెంగళూరు నార్త్, సౌత్, గ్రామీణ జిల్లాల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హెల్త్ కమిషనర్ పాండే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/