పవర్ స్టార్ ‘పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ ‘ గా వుంది..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు వీడియో వచ్చేసింది. ఈరోజు సెప్టెంబ‌ర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా హరిహర వీరమల్లు మేకర్స్ అభిమానులకు బర్త్ డే కానుకను ఇచ్చారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే షూటింగ్‌ ప్రారంభ‌మై నెల‌లు గడుస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించడం లేదు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ మేక‌ర్స్‌పై తీవ్ర ఆస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు పర బర్త్ డే సందర్బంగా పవర్ గ్లాన్స్ ని శుక్రవారం ఉదయం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున…పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున.. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల చేసిన పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ గా వుంది.

మీసం తిప్పి తొడగొట్టిన ఓ తెలుగోడుగా పవన్ కల్యాణ్ మల్లయోధులను మట్టికరిపించిన తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. భారీ స్థాయిలో నిర్మించిన సెట్ లో వందలాది జనాల మధ్య పవన్ మల్లయోధులని మట్టికరిపించే సీన్ టెర్రిఫిక్ గా వుంది. ఈ ఒక్క సీన్ చాలు సినిమాని ఎంత గ్రాండీయర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారో అర్ధం అవుతుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

YouTube video