ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్ వేడుకలను ప్రారంభించిన సీఎం కెసిఆర్

హైదరాబాద్: స్వాతంత్ర్య భారత్‌ 75వ వసం‌తం‌లోకి అడు‌గు‌పె‌డు‌తున్న సంద‌ర్భంగా.. శుక్ర‌వారం నుంచి దేశ‌వ్యా‌ప్తంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‎లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్ వేడుకలను సీఎం కెసిఆర్ ప్రారంభించారు. గార్డెన్స్ లో పోలీసుల గౌరవందనం స్వీకరించిన కెసిఆర్.. తివ్రర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. 2022 ఆగస్టు 15 వరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సంబరాలకు భారతప్రభుత్వం ఇవాళే శ్రీకారం చుట్టింది. ప్రపంచ పోరాటాల చరిత్రలోనే మహోజ్వల ఘట్టం. స్వతంత్ర చరిత్రను మహాత్ముని ముందు… తర్వాతగా చూడాలి. ఆయనకంటే ముందు కూడా స్వతంత్ర్య చరిత్ర ఉంది. కానీ ఆయన తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి అని కెసిఆర్ అన్నారు. ఈ వేడుక‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 75 వారా‌ల‌పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి.

గవ‌ర్నర్‌ తమి‌ళిసై సౌంద‌ర్‌‌రా‌జన్‌ వరం‌గ‌ల్‌లో జాతీయ జెండాను ఆవి‌ష్క‌రించి ఉత్స‌వా‌లను ప్రారం‌భించారు. గురు‌వారం బీఆర్కే భవ‌న్‌తోపాటు ప్రభుత్వ భవ‌నాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/