సెలక్టర్లపై హర్భజన్‌ సింగ్‌ సీరియస్‌

మంచి స్పిన్నర్లు ఉంచుకుని కూడా లేరని ఎలా అంటున్నారు

Harbhajan Singh
Harbhajan Singh

న్యూఢిల్లీ: భారత్‌లో అంతమంచి స్పిన్నర్లు ఉండగా వాషింగ్టన్ సుందర్‌నే ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. అసలు వాషింగ్టన్ సుందర్ బాల్‌ను స్పిన్ చేయలేడని విమర్శించాడు. జలజ్ సక్సేనా అనే స్పిన్నర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఈ టర్బనేటర్ ప్రశ్నించాడు. గత కొన్ని సీజన్‌లుగా జలజ్ సక్సేనా ఆటతీరు చాలా బాగుందని ప్రశంసలు కురిపించిన హర్భజన్ సింగ్ అతన్ని ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించాడు. మరోవైను అక్షయ్ వఖారే కూడా స్థిరమైన బౌలర్ అని అతన్ని కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించాడు. మంచి స్పిన్నర్లను ఉంచుకుని కూడా స్పిన్నర్లు లేరనే వ్యాఖ్యలు సహించరానివని ఆగ్రహం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/