ఈడీ దాడుల నేపథ్యంలో దుబాయి నుంచి తిరుగు ప్రయాణమైన మంత్రి గుంగుల

ఈడీ అధికారులు మరోసారి తెలంగాణ లో హలజడి సృష్టిస్తున్నారు. బుధువారం మంత్రి గంగుల కమలాకర్‌, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసిన ఈడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌లో సోదాలు చేస్తోంది.

గంగుల తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తున్నారు. ఐటీ, ఈడీ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న వార్త తెలియగానే… ఆయన దుబాయి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. నేటి రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకుని నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ రాగానే ఐటీ, ఈడీ దాడులపై ఆయన దృష్టి సారించనున్నారు.

గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన కంపెనీల్లో దాడులు జరుగుతున్నాయి. శ్వేతా ఏజెన్సీ, AS UY షిప్పింగ్, JM బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజెన్సీస్, PSR ఏజెన్సీస్, KVA ఎనర్జీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ సంస్థలు మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాయి. అయితే ఫెమా నిబంధనలకు విరుద్దంగా పరిధికి మించి ఈ సంస్థలు తవ్వకాలు జరిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు జరుగుతున్నాయి.