అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ ఐదో విడుత పాదయాత్ర

4th phase of Bandi Sanjay’s padayatra starts from today

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ లోబిజెపి ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బండి సంజయ్…ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నాల్గు విడతలుగా యాత్ర చేపట్టిన సంజయ్..తాజాగా ఐదో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుండి పాదయాత్రను కొనసాగించనున్నారని ఒక ప్రకటన వెలువడింది. అక్టోబర్ 15 నుండి కొనసాగించనున్న ఐదో విడత పాదయాత్ర బైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుందని బిజెపి శ్రేణులు వెల్లడించాయి.

బాసర అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి బైంసా నుండి పాదయాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు కొనసాగుతూనే ఉంది.