బిజెపి, కాంగ్రెస్ లు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో నడవదు : బాల్క సుమన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్వరాష్ట్రం యూపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేని రాహుల్ తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. జగ్గారెడ్డి ఉద్యమ పార్టీకి ద్రోహం చేశారని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఓ కమెడియన్ గా మారాడని, బండి యాప్ పాదయాత్ర ఫెయిల్యూర్ గా నడుస్తున్నదన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ రైతులు తేరాసాను తప్ప ఏ పార్టీ నమ్మరని, బిజెపి కాంగ్రెస్ లు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో నడవదు అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/