తెలంగాణలో కొత్తగా 1,554 పాజిటివ్‌ కేసులు

మొత్తం మృతుల సంఖ్య 49,259

తెలంగాణలో కొత్తగా 1,554 పాజిటివ్‌ కేసులు
corona virus – Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. మొత్తం 37,666 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 76.5 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 438కి పెరిగింది.

24 గంటల్లో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధి నుంచి 842 కేసులు రావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న 1,281 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణలో కొత్తగా 1,554 పాజిటివ్‌ కేసులు


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/