హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయట కాలు పెట్టాలంటే వణికిపోతున్నారు. ఫిబ్రవరి , మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటె..ఏప్రిల్ , మే నెలలో ఇంకా ఏ రేంజ్ లో కొడతాయో అని అంత భయపడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది.

హైదరాబాద్ లో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి 19 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వొచ్చని సూచించింది. పడమటి వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడురోజుల్లో కొంత హెచ్చు తగ్గులుంటాయని వెల్లడించింది.