తీవ్ర ఇంధన కొరతతో విమానాలు రద్దు చేసిన పాక్‌ ఎయిర్‌లైన్స్‌

బకాయిలు చెల్లించకపోవడంతో పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేత

Pakistan’s national carrier cancels 48 flights due to unavailability of fuel

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నానాటికీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. తాజాగా తీవ్ర ఇంధన కొరత కారణంగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. 11 అంతర్జాతీయ, 13 దేశీ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో 12 విమానాల షెడ్యూల్స్ మార్చామని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో పీఐఏకు చమురు సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి.

మరోవైపు రుణభారం పెరిగిపోతుండటంతో పీఐఏను ప్రైవేటు పరం చేయాలనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రోజువారీ ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని పీఐఏ కోరుతోంది. అయితే ఇప్పటికే తీవ్ర ఆర్థికం సంక్షోభంలో ఉన్న పాక్ ప్రభుత్వం పీఐఏ విన్నపాన్ని అంగీకరించలేదు. ఖజానా ఖాళీ కావడంతో పాక్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.