శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరతలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1,867 గ్రామాల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ.91లక్షల విలువ ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు అంచనా వేశారు. అనంతరం సదరు ప్రయాణికుడుని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/