బిజెపి నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన జేపి నడ్డా

జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి

JP Nadda

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడ జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. ఈ కార్యవర్గంలో తెలంగాణ నేత డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. తెలంగాణ బిజెపి మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. కాగా, దగ్గుబాటి పురందేశ్వరికి కూడా తాజా కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. ఆమెను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/