గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్..

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి పెంచారు. ఈ తరుణంలో సినిమా తాలూకా ఫస్ట్ లుక్కా టీజర్ ను ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు.

టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి కార్ దిగి వస్తున్నట్లు చూపించారు. సునీల్ డోర్ ఓపెన్ చేస్తూ చిరంజీవికి అసిస్టెంట్ గా కనిపించాడు. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో చిరంజీవి కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ ఏడాది విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియోకు తమన్ అందించిన బీజీఎమ్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఇక ఈ మూవీ లో నయనతార , సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video