దుమ్ములేపిన రజని ‘పెద్దన్న’ ట్రైలర్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్..రజని చెల్లెలిగా నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే పెద్దన్న ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు చిత్ర యూనిట్.

ట్రైలర్ చూస్తుంటే రజనీకాంత్ అభిమానులు కోరుకునే యాక్షన్ మరియు కామెడీ…. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందించినట్లు అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్ మరియు డైలాగ్స్ అందరిని మెప్పించాయి. రజనీకాంత్ సోదరిగా కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకునేలా కనిపించింది. ఇక అటు రజనీకాంత్ సరసన నయనతార మెప్పించింది. అలాగే మీనా మరియు కుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే దీపావళి బ్లాక్ బస్టర్ అయినట్లే అని తెలుస్తుంది.

YouTube video