ప్రపంచ వ్యాప్తంగా 4,012కు చేరిన కరోనా మృతులు
ప్రపంచ వ్యాప్తంగా 1,10,000 కరోనా కేసులు

బీజింగ్ : కరోనా వైరస్ (కొవిడ్-19)తో ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 4,012కు చేరింది. కరోనా వైరస్ ఇప్పటివరకు ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,10,000 కరోనా కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అలాగే, షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. చైనాలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ, ఇతర దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,136 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కరోనా సోకిన వారి సంఖ్య 80,750గా ఉంది.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/