రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే కేంద్రం రూ.6,000 సాయం

కేంద్రం తీపి కబురు తెలిపింది. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే కేంద్రం రూ.6,000 సాయం అందించబోతుంది. మిషన్ శక్తి పథకం కింద ఆ ఆఫర్ ఇస్తోంది. ఒకవేళ కవలలు పుడితే.. కవలల్లో ఒకరు ఆడపిల్ల అయినా ఈ పథకం వర్తిస్తుంది. కవలల్లో ఇద్దరూ ఆడపిల్లలే అయినా.. ఇద్దరికీ చెరో రూ.6వేలు ఇవ్వరు. ఒక రూ.6వేలు మాత్రమే ఇస్తారు.

ప్రస్తుతం PMVY కింద తొలికాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుడితే మూడు దశల్లో రూ. 5000 ఇస్తున్నారు. రెండో కాన్పుకు డబ్బులు అందేవి కాదు. తాజాగా దీన్ని సవరిస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ. 6000 ఇవ్వనున్నారు.