మూడు రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఫై బాబు ఫైర్

రాజధానులపైనే తమ స్టాండ్ అని.. ఇంతకుముందు చేసిన బిల్లు లోపభూయిస్టంగా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడిందని.. అందుకే దాన్ని ఉపసంహరించుకొని మెరుగైన బిల్లును తీసుకొస్తామని జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు ఆకాంక్షలను తెలుసుకొని కొత్త బిల్లును తీసుకొస్తామని జగన్ షాక్ ఇచ్చారు. చట్ట న్యాయపరంగా అన్నింటినికి సమాధానం ఇచ్చేందుకు సమగ్ర మెరుగైన బిల్లుతో సభ ముందుకు రాబోతున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు.

జగన్ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ..ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని… రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని బాబు నిప్పులు చెరిగారు. ఇలాంటి నిర్ణయాల కారణంగానే ఏపీ ఇలాంటి పరిస్తితుల్లో ఉందని ఆగ్రహించారు. అటు మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడంతోనే అంతా అయినట్లు కాదని.. సీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయాల్సినవి చాలా ఉన్నాయని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలు తదితర వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నాయని… వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని తెలిపారు.